పకడ్బందీగా కుష్ఠు వ్యాధి సర్వే: DMHO తుకారాం రాథోడ్

కలం, ఖమ్మం బ్యూరో: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు ప్రతి రోజు కనీసం 20 ఇళ్లను సందర్శించి కుష్ఠు వ్యాధి సర్వే నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్ (DMHO Tukaram Rathod) ఆదేశించారు. శనివారం పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

కుష్ఠు వ్యాధి సర్వే నిర్వహించడంతో పాటు మలేరియా నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని తుకారాం రాథోడ్ స్పష్టం చేశారు. 2030 నాటికి టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా క్షయ వ్యాధిపై ప్రచారం చేయాలన్నారు. ప్రస్తుత నెలకు సంబంధించిన వంద శాతం రోగనిరోధక టీకాలు (MR టీకాలతో సహా) పూర్తి చేయాలని తెలిపారు. డీటీసీవో డాక్టర్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్, పీవోడీటీ డాక్టర్ రాందాస్, ఏఎంఓ రాందాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>