కలం, ఉట్నూర్ : ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel ) చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు ఆడబిడ్డల వివాహాలను గౌరవప్రదంగా నిర్వహించుకునేందుకు ఈ పథకాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, జైనూర్ ఏఎంసీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్, పీఏసీఎస్ చైర్మన్ ఎస్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

