మీ కంటె గొప్ప స్నేహితుడు లేరు.. ట్రంప్ పై నెతన్యాహు పొగడ్తల వర్షం

కలం, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ ఎన్నికలకు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనకు అందించిన సపోర్ట్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Netanyahu) కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ అణు ముప్పును నిర్మూలించే విషయంలో రాబోయే ఎన్నికలు ఒక నిర్ణయాత్మకమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ అణుశక్తికి వ్యతిరేకంగా, ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి తమ వ్యూహాత్మక భాగస్వామ్యం అత్యవసరం అని ట్రంప్ నాయకత్వాన్ని నెతన్యాహు ప్రశంసించారు.

“ట్రంప్ నా ప్రియ మిత్రుడు, మీ అసాధారణ మద్దతును నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. వైట్ హౌస్ లో ఇజ్రాయెల్ కు ట్రంప్ కంటె గొప్ప మిత్రుడు ఎప్పుడూ లేరు. మనం కలిసి ఉంటే ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కవు. మీ అసాధారణ ధైర్యానికి, స్పష్టతకు, మద్దతుకు చాలా ధన్యవాదాలు” అని నెతన్యాహు (Netanyahu) ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>