గంభీర్‌కు పఠాన్ మద్దతు.. విమర్శకులకు చురకలు!

క‌లం, స్పోర్ట్స్‌: పూర్తి విషయం తెలియకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సబబు? న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై వచ్చిన విమర్శల నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఇదే ప్రశ్నను లేవనెత్తాడు. ఇషాన్ కిషన్ గాయంతోనే బ్యాటింగ్ స్థానాన్ని మార్చాల్సి వచ్చిందని చెబుతూ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మద్దతుగా నిలిచాడు. ఈలోగా ఇషాన్ రెండో టీ20కి దూరమైనట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తొలి టీ20లో ఇషాన్ సాధారణంగా బ్యాటింగ్ చేసే మూడో స్థానంలో తిలక్ వర్మ వచ్చాడు. ఇషాన్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో గంభీర్ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి.

దీనిపై స్పందించిన ఇర్ఫాన్.. పూర్తి వివరాలు తెలియకుండానే ఒకరిని తప్పుబట్టడం సరికాదని సూచించాడు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం తొందరపడి తీర్పులు ఇవ్వొద్దని హితవు పలికాడు. మరోవైపు, కుడి తొడ కండరానికి గాయం కావడంతో ఇషాన్ రెండో టీ20 ఆడటం లేదు. అతడి స్థానంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. తొలి టీ20లో 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>