రూ.35 కోట్లతో శరవేగంగా కాప్రా చెరువు అభివృద్ధి: హైడ్రా

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా చెరువుల సుందరీకరణపై హైడ్రా (HYDRAA) స్పీడ్ పెంచింది. తాజాగా కాప్రా చెరువును (Kapra Lake) అభివృద్ధి చేసింది. అక్రమార్కుల నుండి చెరువు భూమిని రక్షించిన హైడ్రా.. చెరువు సుందరీకరణ చేపట్టింది. ఈ మేరకు దాదాపు 60 శాతం చెరువు అభివృద్ధి ప‌నులు పూర్త‌య్యాయని హైడ్రా స్పష్టం చేసింది. తాజాగా చెరువు ఫోటోలను సైతం విడుదల చేసింది. మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడేలా, జీవ వైవిద్యం పెంపొందించేలా పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.

హైడ్రా రెండో ద‌శ‌లో అభివృద్ధి చేస్తున్న 14 చెరువుల్లో కాప్రా చెరువు (Kapra Lake) ఒక‌టి. ఈ చెరువు 112.80 ఎకరాల ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం  కలిగి ఉండగా.. డెవలప్ మెంట్ కోసం దాదాపు రూ.35 కోట్లను వెచ్చిస్తున్నారు. చెరువుల పరిరక్షణ అంటే.. నీటిని మాత్రమే ఒడిసిపట్టడం కాదని.. భూ గర్భ జలాలను పెంపొందించడం, వరద ముంపు గ్రామాలను రక్షించడం, పక్షులు, జంతువులకు ఆవాసంగా మార్చడమేనని స్పష్టం చేసింది. ఇదే లక్ష్యంతో హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులను రక్షించే దిశగా పనిచేస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Also Read : స్వియాటెక్‌ 40.. సెరెనా రికార్డు బద్దలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>