మంచుకొండ వద్ద ఘోర ప్రమాదం.. దంపతులు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గాదెపాడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇల్లందు–ఖమ్మం ప్రధాన రహదారిపై మంచుకొండ (Manchukonda) వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. గాదెపాడు గ్రామానికి చెందిన మధ్యబోయిన వెంకటేష్ (40), ఆయన భార్య రమ్య (36) ఆటో నడుపుతూ, కూలి పనులు చేస్తూ కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ఆదివారం రాత్రి  జరిగిన ప్రమాదంలో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కష్టపడి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా దూరమవడంతో గాదెపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>