కలం, మెదక్ జిల్లా : మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేటలో(Makkarajpet) విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు రోడ్డెక్కారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తేనే పంటలను కాపాడుకోగలమని తెలిపారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు విద్యుత్ అధికారులు చేరుకోవడంతో తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రామాయంపేట ఏఈ ఆదయ్య హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

