షాంఘై మాస్టర్స్.. జ్వెరెవ్‌ను చిత్తు చేసిన ఫోకినా

కలం, స్పోర్ట్స్​: షాంఘై మాస్టర్స్‌లో స్పెయిన్‌ టెన్నిస్‌ ఆటగాడు అలెజాండ్రో డేవిడోవిచ్‌ ఫోకినా (Davidovich Fokina) సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఫోకినా 5-7, 6-4, 6-3తో విజయం సాధించాడు. రెండు గంటల ఆరు నిమిషాల పాటు మ్యాచ్‌ సాగింది. ఈ గెలుపుతో అతడు తన కెరీర్‌లో రెండోసారి ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ ఫైనల్‌కు చేరాడు. తొలి సెట్‌ను 5-7తో కోల్పోయిన ఫోకినా.. రెండో సెట్‌లో పుంజుకున్నాడు. కీలక సమయంలో జ్వెరెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 6-4తో సెట్‌ గెలిచాడు. మూడో సెట్‌ ఆరంభంలో జ్వెరెవ్‌ డబుల్‌ ఫాల్ట్‌ చేయడంతో ఫోకినాకు ఆధిక్యం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్పెయిన్‌ ఆటగాడు 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఫోకినా ఫైనల్లో డానిల్‌ మెద్వెదేవ్‌ లేదా రఫేల్‌ జోడర్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం అతడికి షాంఘై మాస్టర్స్‌ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని కల్పించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>