కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని ప్రముఖ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. దసరా పండుగ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన దాండియా ఈవెంట్ లో (Dandiya Accident) ఆకస్మాత్తుగా అగ్నీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోగా.. పలువురికి గాయాలయినట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. వేడుకల్లో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ స్టాండ్, డెకరేషన్ సిస్టమ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి వేలాడదీసిన విద్యుత్ పరికరాలు, లైటింగ్ సిస్టమ్ అమాంతం కిందపడిపోయాయి. దీంతో అక్కడ డాన్స్ చేస్తున్న విద్యార్థులు ప్రాణభయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ఈ క్రమంలో లైటింగ్ పరికరాలు పడటంతో పాటు తొక్కిసలాట జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

