భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలి: పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల భూములను కబ్జాలు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూములను కొంత మంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీలు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లు లేని కుటుంబాలకు నిర్మించి ఇద్దామంటే ప్రభుత్వ భూములు ఉండవు కానీ, కబ్జా కోరుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయని ప్రశ్నించారు.ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంటుందనే అనుమానాలు కలుగుతోందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>