రంజీ ట్రోఫీలో చిన్మయ్ సుతార్ రికార్డు

క‌లం, స్పోర్ట్స్‌: రంజీ ట్రోఫీలో 78 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ (Chinmay Sutar) నాగాలాండ్‌తో జరిగిన ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో అజేయంగా 400 పరుగులు చేశాడు. దీంతో రంజీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌ను 581/9 వద్ద డిక్లేర్ చేసింది. రంజీ ట్రోఫీలో చివరిసారిగా 400 పరుగుల మార్కును అందుకున్నది బీబీ నింబాల్కర్. 1948లో మహారాష్ట్ర తరఫున ఆడిన ఆయన అజేయంగా 443 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మరే బ్యాటర్ కూడా ఈ మైలురాయిని చేరుకోలేదు. ఇప్పుడు 78 ఏళ్ల తర్వాత సుతార్ ఈ ఘనత సాధించాడు. రంజీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు.

సుతార్ తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో 517 బంతులు ఎదుర్కొన్నాడు. 46 ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. జెహు ఆండర్సన్ 69 పరుగులతో రాణించాడు. పదో వికెట్‌కు లాల్‌రెంపుయా చక్‌చువాక్‌తో కలిసి సుతార్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన పదో ఆటగాడిగా కూడా సుతార్ నిలిచాడు. ఈ జాబితాలో బ్రియాన్ లారా, డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు బ్రియాన్ లారా పేరిట ఉంది. ఆయన 501 నాటౌట్ పరుగులు చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>