దుబ్బాక బతుకమ్మ వేదికగా ‘ఎల్ నినో’పై వినూత్న అవగాహన

కలం, మెదక్ బ్యూరో: బతుకమ్మ ​సంస్కృతిని కొనసాగిస్తూ, ప్రస్తుత ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్న ‘ఎల్ నినో’ ఎఫెక్ట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka Bathukamma) మున్సిపాలిటీ 20వ వార్డులో వినూత్న ప్రయత్నం జరిగింది. యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పూల పండుగ బతుకమ్మ తో పాటు వాతావరణ మార్పుల అవగాహన కల్పిస్తూ బతుకమ్మల పై కూడా ఎల్ నినో సంబంధించిన ఫోటోను పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

ఈ మేరకు బతుకమ్మపై ఎల్ నినో కు సంబంధించి ఫోటోను పెట్టడంతో పాటు దుర్గామాత మండపం ముందు ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల కలిగే నష్టాలు, వర్షాభావ పరిస్థితులు, భవిష్యత్తులో రాబోయే కరువు, ఉష్ణోగ్రతల పెరుగుదలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా చిత్రాలను రూపకల్పన చేసి భారీ డిజిటల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పండుగకు వచ్చే ప్రతి భక్తుడు అమ్మవారి దర్శనంతో పాటు, ప్రకృతి పరిరక్షణపై సందేశాన్ని ఇచ్చే విధంగా చేయడం దుబ్బాక ప్రజలను ఆకర్షిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>