NEWS FLASH
కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ (Balkampet Yellamma) అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారిని గజమాలలు, రంగురంగుల సుగంధ పరిమళాల పూలు, స్వర్ణాభరణాలతోపాటు ప్రత్యేకంగా తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ దండలతో ముస్తాబు చేశారు. శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు మైమరిచిపోయారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన భక్తజనం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి సేవలో తరించారు.

