కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలబద్రి శంకర్ను (Balabadri Shankar) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని బాలబద్రి శంకర్కు సూచించారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావుతో పాటు ఇతర ముఖ్య నేతలకు బాలబద్రి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

