ఏపీ మున్సిపోల్స్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎన్నికల (AP Local Body Elections) నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల దాఖలును అడ్డుకున్నా, అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని, నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండేలా చూడాలని ఆదేశించింది. రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

విధుల నిర్వహణలో పక్షపాతంతో వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల (AP Local Body Elections) ప్రక్రియ సజావుగా సాగేందుకు అదనపు బలగాలను మోహరించాలని ఉన్నతాధికారులకు సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>