కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హై కోర్టు (AP High Court) కొట్టేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పారామిలటరీ బలగాలతో భద్రత ఇవ్వాలని కోరగా.. వారి వినతిని తిరస్కరించింది. ఇప్పటికే సింగిల్ జడ్జి వైసీపీ పిటిషన్‌ను కొట్టేసింది. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా.. అక్కడ కూడా చుక్కెదురైంది. వైసీపీ నేతలను నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. వారికి స్వయానా పోలీసులే రక్షణగా ఉంటున్నారని వైసీపీ పిటిషన్‌లో తెలిపింది. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని.. కేంద్ర భద్రతా బలగాలతో ఎన్నికలు పూర్తయ్యే వరకు రక్షణ కల్పించాలని కోరింది.
మరో పిటిషన్ తిరస్కరణ..
నామినేషన్ల గడువు పొడించాలన్న వైసీపీ పిటిషన్‌ను కూడా హై కోర్టు తిరస్కరించింది. ఆదివారం సాయంత్రంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయిందని.. ఈ సమయంలో పిటిషన్ వేయడం సముచితం కాదని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో వైసీపీ నేతలను నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకునేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు.

