కలం, వెబ్ డెస్క్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది ఈరోజు వాయుగుండంగా మారనుండగా, రేపటి నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఈనెల 26 నాటికి ఇది తుఫాన్‌గా (AP Cyclone Alert) పరిణామం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు తీరం వెంబడి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

