పాడి రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. బోనస్ పంపిణీ

‎కలం, ఆలేరు: గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ, రైతుల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) స్పష్టం చేశారు. ఆలేరు మండలంలోని గోలనుకొండ, శారాజీపేట, మందనపల్లి గ్రామాల్లో మదర్ డెయిరీ పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ అందించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బీర్ల అయిలయ్యతోపాటు మదర్ డెయిరీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే పాడి రైతలకు బోనస్ అందించే సంప్రదాయం ఉండేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు నిరాశకు గురయ్యారన్నారు. నేడు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ సహకారంతో మళ్లీ పాల ఉత్పత్తిదారులకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు బోనస్ అందజేయడం ద్వారా వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తోందని, ఇది రైతన్నల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.

వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను అనుబంధ వృత్తిగా ఎంచుకున్న రైతులు పాల ఉత్పత్తి ద్వారా ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ ప్రోత్సాహకాలు ఉపయోగపడుతాయన్నారు. పాడి రైతులు నాణ్యమైన పాలను ఉత్పత్తి చేస్తూ సహకార రంగం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. పశుపోషణలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ పాల ఉత్పత్తిని మరింత పెంచుకోవాలని సూచించారు. మదర్ డెయిరీ ద్వారా పాల సేకరణను విస్తృతం చేస్తూ, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>