బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల

కలం, వెబ్ డెస్క్: హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హెల్త్ బులిటెన్‌ను ఏఐజీ ఆసుపత్రి విడుదల చేసింది. ఎడమ కాలులోని క్వాడ్రిసెప్స్ టెండన్ (తొడ కండరాన్ని మోకాలి చిప్పతో కలిపే ప్రధాన కణజాలం) పూర్తిగా విరిగిపోయిందని.. పలు చోట్ల చీలికలు వచ్చినట్లు పేర్కొంది. దీంతో సుమారు 3 గంటల పాటు డాక్టర్ల బృందం శ్రమించి, విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు వివరించింది.

కోలుకోవడానికి మరికొంత సమయం..

గాయమైన ప్రదేశం అత్యంత సున్నితమైందని.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం బాలయ్య పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. వైద్యులు నిరంతరం ఆయన్ను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో బాలయ్య గాయపడిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>