గుంతలను పూడ్చిన ట్రాఫిక్ పోలీసులకు సీపీ గౌష్ ఆలం అభినందనలు

కలం, ​కరీంనగర్ బ్యూరో : కరీంనగర్లో (Karimnagar) రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను స్వయంగా పూడ్చి ప్రయాణికులకు రక్షణ కల్పించిన ట్రాఫిక్ ఆర్‌ఎస్ఐ ఎస్. శ్రీకాంత్, వారి సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ​ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… కేవలం ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతతో వాహనదారుల భద్రత కోసం శ్రమించిన ఆర్‌ఎస్ఐ శ్రీకాంత్ చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, విశేష సేవలు అందిస్తున్న కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది యావత్ బృందాన్ని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>