ఏటా జాబ్ క్యాలెండర్.. కర్నాటక సీఎం కీలక నిర్ణయాలు

కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన డీకే శివకుమార్ (Karnataka CM DK Shivakumar) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాధ్యతలు చేపట్టారు. ఇక ముఖ్యమంత్రిగా తొలి మీడియా సమావేశంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు డీకే శుభవార్త చెప్పారు. విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాస్ ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కీలక హామీనిచ్చారు.

నిరుద్యోగుల ఎన్ రోల్ కోసం ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ లు ఏర్పాటు చేస్తామని డీకే ప్రకటించారు. భారత్ జోడో క్లబ్ ఏర్పాటు చేస్తామని.. వీటి ద్వారా యువత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రొత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 భారత్ జోడో క్లబ్ లు ఏర్పాటు చేస్తామని డీకే శివకుమార్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>