కలం, వెబ్ డెస్క్: ఖలిస్థాన్ ఉద్యమంపై తరచూ విమర్శలు చేసే ఓ మహిళా యూట్యూబర్ (Nancy Grewal) దారుణ హత్యకు గురైంది. కెనడాలోని లాసాల్లో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. స్థానిక పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లోని పంజాబ్ మూలాలు కలిగిన నాన్సీ గ్రేవాల్(45) కెనడాలోని విండ్సర్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి లాసాల్లోని టాడ్లేన్లో ఉన్న ఇంట్లో ఆమె కత్తిపోట్లకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు వెళ్లి హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, యూబ్యూబర్గా పనిచేసే నాన్సీ(Nancy Grewal) అనేక వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలు చెప్పేవారు. భారత్–కెనడా సంబంధాలు, ఖలిస్థాన్ ఉద్యమం, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు, పంజాబ్‌లోని కొందరు రాజకీయ, మత నాయకుల ప్రవర్తన వంటి వాటిపై సోషల్ మీడియా వేదికగా తన మాటలు, రాతలతో బాగా ఫేమస్ అయ్యారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, ట్రూడో తీరును తప్పుపడుతూ ఆమె వీడియాలు, సోషల్ మీడియా పోస్టులు, బహిరంగ విమర్శలు చేశారు. దీనిపై బెదిరింపులు సైతం ఎదుర్కొన్నారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని, అందువల్లే నాన్సీ దారుణ హత్యకు గురైందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఖమేనీ మృతిపై స్పందించిన భారత్
Follow Us On: Instagram

