epaper
Thursday, March 5, 2026
epaper

99 రోజుల ప్రగతి ప్రణాళిక లోగో విడుదల

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు (99 Day Action Plan) సంబంధించిన లోగో (Logo) విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, మహిళా సంక్షేమం వంటి 10 ప్రధాన అంశాలతో కూడిన ఈ ప్రణాళికను ఐదు దశల్లో అమలు చేయనున్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఈ 99 రోజుల లక్ష్యాలను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

Read Also: చంద్రబాబూ బీకేర్‌ఫుల్.. మాణిక్కం ఠాకూర్ హెచ్చరిక

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!