epaper
Tuesday, March 3, 2026
epaper

మా ఊరికి రోడ్డు వేయండి సార్.. మోకాళ్లపై కూర్చుని వేడుకున్న చిన్నారులు

కలం, డెస్క్ : ఏపీలో ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలయింది. చాలా గ్రామాలకు రోడ్లు లేక అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ఊర్లకు చెందిన చిన్నారులు రోడ్లు కావాలంటూ వేడుకుంటూ వీడియోలు చేస్తున్నారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కడప (Kadapa) జిల్లా చాపాడు మండలం, ఎన్.ఓబాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిప్పిరెడ్డిపల్లెకు రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ గ్రామస్తులు, చిన్నారులు బురదలో మోకాళ్లపై కూర్చుని రోడ్లు వేయాలంటూ వేడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఇలా వీడియోలు వైరల్ అయిన వాటిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పందించి రోడ్లు వేయించారు. మరి తిప్పిరెడ్డి పల్లెకు కూడా వేయిస్తారా లేదా అనేది చూడాలి.

Read Also: జర్నలిస్ట్ మూర్తి సస్పెండ్.. మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!