epaper
Tuesday, March 3, 2026
epaper

పెద్ది : ‘రయ్ రయ్ రా రా’ క్రేజ్.. అదిరిపోయిన చరణ్ హుక్ స్టెప్స్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , బుచ్చి బాబు సన(Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది” (Peddi). ఏప్రిల్ 30, 2026 న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్షేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సింగల్ “రయ్ రయ్ రా రా ” సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

రెహమాన్ (AR Rahman) స్వయంగా పాడిన ఈ పాటలో రామ్ చరణ్ లుక్స్, మైండ్ బ్లోయింగ్ స్టెప్స్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తన అద్భుతమైన గ్రేస్ తో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్స్‌కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ స్టెప్స్ అదిరిపోయాయి  ఈ సాంగ్ రిలీజ్ అయిన క్షణాల్లోనే మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సాంగ్ చివరిలో చరణ్ క్రికెట్ ఆడే క్లిప్ మాత్రం ఫ్యాన్స్‌కి ఫుల్ హై ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!