కలం, డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్దిపై (Peddi) భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. కానీ అంచనాలు మాత్రం బాగానే పెరుగుతున్నాయి. చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లలో డీలింగ్స్ ఓకే అవుతున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర ఏరియాల్లో భారీ ధర పలుకుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పెద్దికి పోటీగా తెలుగులో ఎవరూ రావట్లేదు. కానీ తమిళ స్టార్ హీరో ధనుష్ రంగంలోకి దిగుతున్నాడు. విగ్నేష్ రాజా డైరెక్షన్ లో ధనుష్ నటిస్తున్న మూవీ ‘కర’ (Kara). ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో అసురన్ రేంజ్ లో ఉంటుందనే ప్రచారం తమిళనాట వినిపిస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా దీన్ని తీస్తున్నారు. మామూలుగా ధనుష్ చాలా రియలస్టిక్ సినిమాల్లోనే నటిస్తుంటాడు. ఆయన సినిమాల్లో కంటెంట్ పైనే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ధనుష్ ఇప్పుడు నటిస్తున్న కర మూవీ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ధనుష్ కు తెలుగునాట భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో చాలా సినిమాల్లో ధనుష్ నటించాడు.
ఒకవేళ మూవీకి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా.. తమిళంతో పాటు తెలుగులోనూ పెద్దికి గట్టి పోటీ తప్పదంటున్నారు ట్రేడ్ నిపుణులు. పెద్ది, కర రెండూ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలే అయినా.. దేని కంటెంట్ దానిదే. ఒకవేళ రెండింటికీ పాజిటివ్ టాక్ వస్తే.. అప్పుడు వసూళ్లను పంచుకోవాల్సిందే. అలా కాకుండా ఏ ఒక్క సినిమాకో హిట్ టాక్ వస్తే మాత్రం.. ఇంకో సినిమాకు భారీగా లాస్ తప్పదు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

