epaper
Monday, March 2, 2026
epaper

రగులుతున్న పశ్చిమాసియా.. కువైట్​లో కూలిన​ ఎఫ్​‌‌15

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో రగులుతోంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ (Iran)​.. గల్ఫ్​ దేశాలపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. డ్రోన్లు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో యూఎస్​కు చెందిన ఎఫ్​15 ఫైటర్​ జెట్ (F15 Jet Down)​ ఒకటి కువైట్​లో కూలిపోయింది. దీనిని తామే కూల్చేసినట్లు ఇరాన్​ ప్రకటించుకుంది. ఎఫ్15 కూలుతుండగా తీసిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. ఈ ఘటనలో పైలెట్లు ఇద్దరూ క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది. అలాగే కువైట్​లోని అమెరికా ఎంబసీపైనా దాడి జరిగింది. రాయబార కార్యాలయంపైనా ఇరాన్​ డ్రోన్​తో దాడి చేసింది. ఎంబసీ కార్యాలయం దట్టంగా పొగలు, మంటలు వెలువడుతున్న ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి.

మరోవైపు ఎఫ్​15తోపాటు (F15 Jet Down) అమెరికాకు చెందిన చాలా యుద్ధ విమానాలు కూలిపోయినట్లు కువైట్​ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, ఎవరూ చనిపోలేదని పేర్కొంది. తమ దళాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో సిబ్బందిని రక్షించినట్లు తెలిపింది.

Read Also: ప్రవాసాంధ్రులను వెంటనే వెనక్కు తీసుకురావాలి : మాజీ సీఎం జగన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!