epaper
Sunday, March 1, 2026
epaper

కవితకు క్లీన్‌చిట్.. కేసీఆర్ వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో కవిత (Kavitha)కు క్లీన్ చిట్ దక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు స్పందిస్తున్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చిందని ఆమె అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేసీఆర్ (KCR) ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి గతంలో ఓ మీడియా సంస్థలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ‘లిక్కర్ స్కామ్ ఓ బోగస్. నా కూతురు ముత్యంలా బయటకు వస్తుంది. కవితకు ఏం సంబంధం లేదు. ఈ స్కామ్ నరేంద్రమోదీ సృష్టి. ఇందులో అసలు స్కామ్ ఎక్కడుంది. ప్రతి రాష్ట్రం లిక్కర్ పాలసీ తీసుకొస్తుంది. అలాగే ఢిల్లీ కూడా చేసింది. నా కూతురుకు ఏం సంబందం. ఏ కేసులో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. అసలు ఈ కేసు నిలబడదు.’ అంటూ కేసీఆర్ గతంలో వ్యాఖ్యానించారు.

కేసీఆర్ చెప్పినట్టుగానే కవితకు ఈ కేసులో క్లీన్ చిట్ దక్కడంతో గతంలో ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

Read Also : కవిత గారూ.. అంటూ కేటీఆర్ షాకింగ్ రియాక్షన్..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!