కలం, డెస్క్ : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు (Buchi Babu) పెద్ది మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ మొదట్లో మార్చి 27న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అనుకోకుండా ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు ఎవరితో చేస్తారనే ప్రచారం మొదలైంది. బుచ్చిబాబు (Buchi Babu) మేకింగ్ స్టైల్ చూసిన అక్కినేని నాగార్జున.. కచ్చితంగా తన కొడుకు అఖిల్ తో మూవీ చేయాలంటూ కోరినట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
అఖిల్ ప్రస్తుతం లెనిన్ మూవీలో నటిస్తున్నారు. రాయలసీమ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఆ సినిమా మే 1న రిలీజ్ అవుతోంది. దీంతో పెద్ది, లెనిన్ మధ్య బాక్సాఫీస్ వార్ ఉండే ఛాన్స్ లేకపోలేదు. అయితే లెనిన్ తో ఫస్ట్ టైమ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కనిపిస్తున్నాడు అఖిల్. పెద్ది తర్వాత అఖిల్ తోనే బుచ్చిబాబు మూవీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఒకవేళ అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కు పండగే అంటున్నారు సినీ ప్రేమకులు. పెద్ది ఏ రేంజ్ హిట్ అయితే ఆ స్థాయిలో బుచ్చిబాబుకు క్రెడిట్ దక్కుతుంది. మరి పెద్ది తర్వాత నిజంగానే అఖిల్ తో చేస్తాడా లేదా అనేది చూడాలి.

