కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో శుక్రవారం ఆలిండియా లాయర్స్ యూనియన్ (AILU) అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల్లో.. నూతన జిల్లా గౌరవ అధ్యక్షులుగా జి. సత్యనారాయణ రెడ్డి, అధ్యక్షులుగా నీర్ల దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లైశెట్టి హరికృష్ణ ఎన్నికయ్యారు.
నూతన జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా భీమా సాహెబ్, ధీరజ్ కుమార్, భవాని, శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా వనజ, సురేష్, ఎండి సోహెల్, శ్రీనివాస్ ఎన్నికైనట్లు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు సిహెచ్ శైలజ ప్రకటించారు. అలాగే మహిళా విభాగం కన్వీనర్‌గా తమ్మిశెట్టి భవాని, కో-కన్వీనర్లుగా వనజ, లావణ్య, వసంత ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం సిహెచ్ శైలజ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడనున్నట్లు పేర్కొన్నారు.

