ప్రమాదాలకు నిలయంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ బ్రిడ్జ్

కలం, జగిత్యాల: జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై ధరూర్, టీఆర్ నగర్ సమీపంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ బ్రిడ్జి (SRSP Canal Bridge) మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు నిలయంగా మారింది. బ్రిడ్జి నిర్మించి ఏళ్లు గడుస్తున్నా, ఇరువైపులా ఉన్న సైడ్‌వాల్స్‌కు కనీసం పెయింటింగ్ కూడా వేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక మార్గంలోని బ్రిడ్జిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి రహదారి పూర్తిగా దెబ్బతిన్నది.

వేగంగా వచ్చే వాహనాలు గుంతలను తప్పించే క్రమంలో ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు బ్రిడ్జికి రిఫ్లెక్టివ్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక సూచికలు లేకపోవడంతో రాత్రివేళల్లో చీకటిలో బ్రిడ్జి అంచులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చాలని, సైడ్‌వాల్స్‌కు పెయింటింగ్ వేసి రేడియం రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. పెను ప్రమాదాలు జరగకముందే అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>