కేసీఆర్ దంపతులకు వివాహ ఆహ్వానం అందజేసిన పైళ్ల శేఖర్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులను (KCR Couple) భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Pailla Shekar Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ కేసీఆర్, శోభమ్మ దంపతులకు వివాహ ఆహ్వాన పత్రికను (Wedding Invitation) అందజేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. కుటుంబంలో జరగనున్న శుభకార్యానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పైళ్ల శేఖర్ రెడ్డి అందించిన ఆహ్వాన పత్రికను కేసీఆర్ దంపతులు స్వీకరించారు. ఈ మర్యాదపూర్వక భేటీకి సంబంధించిన వివరాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగించాయి. మాజీ ఎమ్మెల్యే తన కుమార్తె వివాహానికి పార్టీ అధినేతను స్వయంగా కలిసి ఆహ్వానించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>