నేడు హైబ్రిడ్ విధానంలో ఏపీ క్యాబినెట్ భేటీ

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet) సమావేశం హైబ్రిడ్ విధానంలో ప్రారంభం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులు నేరుగా సచివాలయంలో హాజరుకానుండగా, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఇటీవల విరుచుకుపడిన ‘అర్నబ్’ తుఫాన్ వల్ల సంభవించిన తీవ్ర నష్టం, సహాయక చర్యల వేగవంతం, బాధితులకు పరిహారం అందించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించి ఆమోదం తెలపనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఇతర కీలక పరిపాలనా అంశాలపై ఏపీ మంత్రిమండలి సమీక్షించనుంది.

అయితే క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. బాధితులకు నేరుగా భరోసా కల్పిస్తూ, క్షేత్రస్థాయిలో అందుతున్న పునరావాస చర్యలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ బాధితుల కోసం కూటమి ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారంతో పాటు, దెబ్బతిన్న ఇళ్లకు రూ.10,000 వరకు, చిన్న వ్యాపారాలు, రెస్టారెంట్లకు రూ.25,000, పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి రూ. 1000 నుంచి రూ. 3,000 వరకు తక్షణ సాయం అందిస్తామని తెలిపింది.

అటు ఎంఎస్ఎంఈలకు టర్నోవర్ ఆధారంగా రూ. 50,000 నుండి రూ. 1.5 లక్షల వరకు సహాయం ప్రకటించగా, పాక్షికంగా దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు రూ. 3,000, త్రిచక్ర వాహనాలకు రూ.10,000 నష్టపరిహారం ఇస్తామని వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమం కోసం చేపల వలల మరమ్మతులకు రూ. 5,000, బోట్లు పూర్తిగా దెబ్బతింటే రూ.20,000 నుండి రూ.25,000 వరకు అందిస్తామని పేర్కొంది. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు హెక్టారుకు రూ.15,000 నుండి రూ.75,000 వరకు పరిహారాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>