ఇజ్రాయెల్ ప్రధానిపై దాడి.. అసలు నిజం ఏంటి?

కలం, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై టెల్ అవీవ్‌లో దాడి (Netanyahu Attack) జరిగిందని, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, అమెరికాకు తరలించేందుకు ప్రత్యేక విమానం వస్తోందని భారీ ఎత్తున కొన్ని వీడియోలు, పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

అధికారిక వర్గాల నుంచి లేదా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఇవి పూర్తిగా నిరాధారమైన, సోషల్ మీడియాలో సంచలనం కోసం సృష్టించిన వదంతులు మాత్రమేనని తేలింది. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా వస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>