కలం, స్పోర్ట్స్ : ప్రపంచ నంబర్ వన్ ఎలెనా రిబాకినా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనాలో జరిగిన నింగ్బో ఓపెన్ ఫైనల్లో కెనడా ప్లేయర్ లేలాహ్ ఫెర్నాండెజ్‌ను చిత్తు చేసింది. 6-2, 6-2తో వరుస సెట్లలో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. మ్యాచ్ కేవలం గంటా 16 నిమిషాల్లోనే ముగిసింది. తొలి సెట్‌లో ఆరంభంలో బ్రేక్ పాయింట్లను ఎదుర్కొన్న రిబాకినా.. ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి ఆధిపత్యం సాధించింది. రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించింది.
ఫెర్నాండెజ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి సులువుగా విజయం అందుకుంది. ఈ విజయంతో రిబాకినా ఈ ఏడాది నాలుగో టైటిల్‌ను, కెరీర్‌లో 15వ టూర్ స్థాయి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, స్టుట్‌గార్ట్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను సాధించింది. నింగ్బో టోర్నీలో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ఆమె విజయాల పరంపర ఎనిమిది మ్యాచ్‌లకు చేరింది.

