ఏపీ ఎన్నికల సంఘం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు దాఖలు చేసినవారిలో అర్హులైన జాబితాను ఎన్నికల సంఘం (AP Election Commission) విడుదల చేసింది. రాష్ట్రంలోని 9,829 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన వాటిలో 40,045 నామినేషన్లు, 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 4,770 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ప్రకటించింది. వీరు మాత్రమే పోటీలో ఉంటారని.. అనర్హతకు గురైన వారికి కారణాలను కూడా చెప్పినట్లు పేర్కొంది. నవంబర్ 3వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. 5న లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

పోటాపోటీగా సాగిన నామినేషన్లు..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం టీడీపీ, వైసీపీ మధ్య పోటాపోటీగా సాగింది. కడప, చిత్తూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఎన్నికల సంఘం స్వయంగా జోక్యం చేసుకుని.. నామినేషన్లు వేయని అభ్యర్థులను దగ్గరుండి వేయించేలా భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>