అంగరంగ వైభవంగా నందిగుండం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

కలం, నిర్మల్ : నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, బాజాభజంత్రీల నడుమ ఊరేగింపు చేపట్టారు. మహిళలు మంగళహారతులతో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. దేవి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. బంగల్ పేట్ వినాయక సాగర్ చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కొండాజి వెంకటాచారి మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆలయంలో 6 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి మాలధారణ చేశారని తెలిపారు. ప్రజల్లో భక్తిభావం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. దసరా అనంతరం వచ్చే మొదటి ఆదివారం అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో సేవలందించిన ప్రతి ఒక్కరిపై దుర్గామాత కృపాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>