కలం, ఆదిలాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ నేడు నిర్వహించిన 139వ మన్ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో గోండు మన్యం వీరుడు కొమురం భీమ్ త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గోండు మన్యం వీరుడు కొమురం భీమ్ త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో స్మరించుకోవడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. జల్ – జంగల్ – జమీన్ హక్కుల పరిరక్షణతోపాటు ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయన త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కొమురం భీమ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
Also Read : రష్యా–ఉక్రెయిన్ వార్: మెలానియా మ్యాజిక్!
Follow Us On: X(Twitter)

