సాంకేతికతతో సైబర్ నేరాలకు చెక్: ఎస్పీ రోహిత్ రాజు

​కలం, ఖమ్మం బ్యూరో: సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలకు చెక్ పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) పిలుపునిచ్చారు. శనివారం సైబర్ వారియర్స్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ​ఎన్సీఆర్పీ, జీఆర్ఎం, ఎంఆర్ఎఫ్, సహయోగ్, సైబర్ క్రైమ్ అనలిటిక్స్ అండ్ ప్రాసిక్యూషన్ సిస్టమ్ వంటి వివిధ పోర్టళ్ల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఫిర్యాదుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. 1930 హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన, పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్ల అమలును వేగవంతం చేయాలని తెలిపారు. సైబర్ సెల్ సీఐ నరేష్, ఎస్సై జుబేదా బేగం, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>