ప్రశాంతంగా ముగిసిన టీజీపీఎస్సీ పరీక్ష

కలం, కరీంనగర్: టీజీపీఎస్సీ (TGPSC)  శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్-2) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని వాణి నికేతన్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాబట్టి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో 150 మంది అభ్యర్థులకు గాను ఉదయం 73 మంది, మధ్యాహ్నం 74 మంది పరీక్షకు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ హరికృష్ణ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>