కరీంనగర్ మెడికల్ కాలేజీ పనుల పరిశీలన

కలం, కరీంనగర్: కరీంనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Karimnagar Medical College), హాస్టళ్ల భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తపల్లిలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ, విద్యార్థుల హాస్టల్ భవనాలను, నర్సింగ్ కళాశాల భవనాలను కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతి, పెండింగ్ వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల హాస్టల్ భవనాలను నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి సంబంధించి మిగిలి ఉన్న పనులపై నివేదిక సమర్పించాలని ఆర్అండ్‌బీ డీఈ శ్రీకాంత్‌ను ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. నవంబర్ నెలలోగా పూర్తి చేయనున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. టీజీఎంఎస్ఐడీసీ ఈఈ విశ్వ ప్రసాద్ ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>