త‌మ్ముడిని చంపిన అన్న అరెస్ట్‌!

కలం, అచ్చంపేట: క్షణికావేశంలో అన్న చేతిలో తమ్ముడు మృతి చెందిన ఘోర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) మండలం బక్క లింగాయపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట‌ మండలం సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బక్క లింగాయపల్లిలో బోరు మోటర్ విషయంలో ఇరువురి మధ్య చిన్న త‌గాదా జరిగింది. మాటా మాటా పెరిగి అన్న బావ్ సింగ్, తమ్ముడు కేతావత్ మోహన్‌ను కట్టెతో బలంగా కొట్టాడు. దీంతో మోహ‌న్ అక్క‌డిక‌క్క‌డే మరణించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు అయిన బావ్ సింగ్ ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>