కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట (Seethampeta)లో విషాదం చోటుచేసుకుంది. మహేశ్వరి (21) వ్యవసాయ బావిలో మృతదేహమై కనిపించారు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన శేఖర్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. దంపతులకు తొమ్మిది నెలల పాప శరణ్య, రెండేళ్ల కుమారుడు దేవాన్ష్ ఉన్నారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మహేశ్వరి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా బావిలో మృతదేహం కనిపించింది. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

