కలం, బాసర : రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి, ప్రాణనష్టాన్ని అరికట్టాలని భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ (Bhainsa ASP Sai Kiran) అన్నారు. బాసర పోలీస్‌స్టేషన్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను శనివారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ఏఎస్పీ (Bhainsa ASP Sai Kiran) మాట్లాడారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే ప్రమాదాలకు కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ దీపక్ పాల్గొన్నారు.

