ట్రాన్స్‌జెండర్లు సమాజంలో భాగమే: యశ్వంత్ సింగ్

కలం, కరీంనగర్ బ్యూరో: ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో భాగమేనని, వారు సైతం సమాన హక్కులు, ఆత్మగౌరవంతో జీవించేలా చూడాలని కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్ (Yashwanth Singh)  పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఇండియా హెచ్‌ఐవీ ఎయిడ్స్ అలయన్స్ మద్దతుతో ‘చేతన’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘సాహస్’ ప్రాజెక్టు ద్వారా ట్రాన్స్‌జెండర్ల కోసం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. చట్టాలున్నా ట్రాన్స్‌జెండర్లు క్షేత్రస్థాయిలో వివక్షను ఎదుర్కొంటున్నారని యశ్వంత్ సింగ్ అన్నారు. వారికి ఉచిత న్యాయ సహాయంతో పాటు రేషన్ కార్డులు, ఇళ్లు, గుర్తింపు పత్రాలు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

గుర్తింపు కార్డుల అందజేత..

జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సబ్సిడీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. చేతన సంస్థ అధ్యక్షుడు కోట శివకుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు కుటుంబం, సమాజం నుంచి ఆదరణ లభించక, విద్యార్హతల పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజగోపాల్ రావు, పోలీస్ ఇన్‌స్పెక్టర్ పుల్లయ్య, బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్ ధనలక్ష్మి, చేతన సంస్థ ప్రతినిధులు వి. శివయ్య, సంజీవ్, గోల్డీ, శివాని, లాస్య, కోమలి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>