భగత్ నగర్ దోపిడీ ముఠాపై పీడీ యాక్ట్ ప్రయోగం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లోని భగత్ నగర్ భారీ దోపిడీ (Bhagat Nagar Robbery)  కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలయం పీడీ యాక్ట్ (నిరోధక నిర్బంధ చట్టం) అమలు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న నిందితులకు ఉత్తర్వులను అందజేసిన అనంతరం వారిని కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

రూ.43 లక్షల విలువైన సొత్తు..

జులై 21న అర్ధరాత్రి వేళ భగత్ నగర్‌లోని మహ్మద్ అజ్మత్ అలీ ఇంట్లోకి డమ్మీ తుపాకులు, కత్తులతో ముఠా చొరబడింది. వృద్ధులు, మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి, వారిని ఒక గదిలో బంధించారు. అనంతరం రూ.25 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు, రెండు బైకులతో కలిపి సుమారు రూ.43 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించి, పీడీ చట్టం ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ టౌన్ ఏసీపీ ఎన్.వెంకటస్వామి, వన్ టౌన్ సీఐ కె.రాంచందర్ రావును పోలీస్ కమిషనర్ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>