కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ (Sunil Bansal) శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. నగరంలోని బీజేపీ (BJP) కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో పదవులు అనుభవిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయని నాయకులు వెంటనే తప్పుకోవాలన్నారు. పని చేయనప్పుడు పదవులు ఎందుకని ఆయన నిలదీశారు. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదని, నాయకులందరూ జిల్లాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పని చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ కార్యాలయానికే పరిమితం కాకుండా రాబోయే ప్రతి ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
ఇకపై తాను ఫుల్ టైమ్ తెలంగాణలోనే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ప్రతి నెలా నేతల పని తీరుపై ప్రత్యేక నివేదికను అందజేయాలని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. పార్టీలో కేవలం పదవుల కోసం కాకుండా, క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే వారికే భవిష్యత్తు ఉంటుందని ఆయన (Sunil Bansal) తేల్చిచెప్పారు.
Also Read : సీఎం ఇంటిని ముట్టడిస్తాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వార్నింగ్
Follow Us On: X(Twitter)

