కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాకు నూతనంగా నియమితులైన అదనపు కలెక్టర్లు (Additional Collectors) వెంకట మాధవరావు రాథోడ్ రమేష్‌లను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ (Syed Haider) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా, అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు వినోద్, అబ్దుల్ సాధిక్, రవి, వసంత్ రావు, మెరుగు రాజన్న, చొక్కాల భూమన్న, అరవింద్, షేక్ ఇమామ్, షేక్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

