ష‌ర్మిల కూతురి పెళ్లి ఎక్క‌డ‌.. జ‌గ‌న్ ట్విస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె అంజిలి రెడ్డి వివాహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, వైఎస్‌ కుటుంబంలో హాట్ టాపిక్‌గా మారింది. నవంబర్ 25న జరగనున్న ఈ పెళ్లికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ను వేదికగా నిర్ణయించారు. ఇప్పటికే పెళ్లి ఆహ్వాన పత్రికల్లోనూ అదే చిరునామాను ముద్రించి, బంధువులు, సన్నిహితులు, ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. తాజాగా పెళ్లి పత్రికతో పాటు వైఎస్ జగన్ (YS Jagan) షర్మిలకు రాసిన లేఖ బయటకు రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది.

అయితే, యలహంకలోని తన ఇంట్లో పెళ్లి వేడుక నిర్వహించడంపై వైఎస్ జగన్ (YS Jagan) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న‌ భద్రత, గోప్యతకు సంబంధించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ అక్టోబర్ 9న షర్మిలకు లేఖ రాశారు. అంజిలి (YS Anjili) పెళ్లి ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులు, క్యాటరింగ్ సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లు, ఇతర సిబ్బంది రాకపోకలు ఉంటాయని, దీని వల్ల కుటుంబ భద్రతకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని ష‌ర్మిల‌ను కోరారు. హైదరాబాద్‌లోని తన లోటస్ పాండ్ ఇంట్లో పెళ్లి చేద్దామ‌ని సూచించారు.

అయితే షర్మిల మాత్రం యలహంక ప్యాలెస్‌లోనే కుమార్తె వివాహం నిర్వహించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహ్వానాలు పంపిన నేపథ్యంలో వేదిక మార్పుపై ఉత్కంఠ నెలకొంది. జగన్ అభ్యంతరాలు, షర్మిల కుటుంబ నిర్ణయం మధ్య ఈ వివాహ వేడుక ఎక్కడ జరుగుతుందనే అంశంపై ఆసక్తి కొనసాగుతోంది. దీనిపై ఇరు కుటుంబాల నుంచి తదుపరి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

Also Read : ఎస్సై ప్రియాంకపై వేటు.. విచారణకు ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>