రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యం: ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి: ఎల్ నినో ప్రభావంతో (El Nino Impact) వ్యవసాయ రంగంపై పడుతున్న ప్రభావాల దృష్ట్యా రైతులకు కొండంత భరోసా ఇవ్వాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పనిగా పెట్టుకుందా అని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar) తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. కానీ, బీఆర్‌ఎస్ నాయకులు దానికి భిన్నంగా ప్రభుత్వంపై బురద చల్లే రాజకీయ విమర్శలకే పరిమితం కావడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎల్ నినో పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి నష్టం కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించడం, రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా, సాగునీరు, తాగునీటి లభ్యతను నిరంతరం సమీక్షిస్తూ నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. రైతులకు భరోసా కల్పించకుండా కేవలం ప్రభుత్వంపై నిందలు వేయడం ద్వారా బీఆర్‌ఎస్ సాధించేదేమిటని ఆయన నిలదీశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఎమ్మెల్యే (Kumbam Anil Kumar) హితవు పలికారు.

Also Read : మ‌రో వివాదంలో చిక్కుకున్న “ఇడుపుకాయితం”!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>